![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో..... ముహూర్తం టైమ్ అయింది. ఇద్దరు రింగ్ తొడగండి అని పంతులు గారు చెప్తాడు. అదేంటి ఈ రామలక్ష్మి ఇంకా బయటపడడం లేదు కొంపదీసి నిజంగానే రామలక్ష్మినా ఏంటని సీతాకాంత్ అనుకుంటాడు.
రమ్య రింగ్ తొడగబోతుంటే.. ఏంటీ ఏయ్ ఏం చేస్తున్నావని సీతాకాంత్ అంటాడు మనం ఎంగేజ్ మెంట్ చేసుకుంటేనే తను బయటపడుతుందని రమ్య అంటుంది. నేను ఎంగేజ్ మెంట్ ఆపితే నేనే రామలక్ష్మి అని కన్ఫమ్ చేసుకుంటారు. ఆ ఛాన్స్ మీకు ఇవ్వను ఎంగేజ్ మెంట్ ఎలా ఆపాలో నాకు తెలుసని రామలక్ష్మి అనుకుంటుంది. అప్పుడే సెక్యూరిటీ వచ్చి రామ్ బాబు బయటకు వెళ్ళాడని చెప్తాడు. వెంటనే సీతాకాంత్ వెళ్ళబోతుంటే ఎక్కడికి రింగ్ చేంజ్ చేసుకొని. వెళ్ళండి అని రమ్య అంటుంది ఇప్పుడు ఇది అవసరమా.. అక్కడ బాబు అని సీతాకాంత్ అనగానే పోతే పోనివ్వండి మీ సొంత బాబు అయినట్టు అలా వెళ్లిపోతున్నారని రమ్య అనగానే.. ఇదేనా నువ్వు రామ్ ని తల్లి గా చూసుకుంటానని చెప్పింది అంటూ రమ్యపై సీతాకాంత్ కోప్పడతాడు.ఇక ఈ ఎంగేజ్ మెంట్ ఆపేస్తున్నానని సీతాకాంత్ చెప్తాడు. ఇక రామ్ డల్ గా ఉంటే తన దగ్గరికి రామలక్ష్మి వెళ్లి ఏమైందని అడుగుగా.. మా నాన్న ఈ ఎంగేజ్ మెంట్ చేసుకోవడం ఇష్టం లేదని రామ్ చెప్పగానే.. ఇక్కడ నుండి కాసేపు వెళ్ళమని రామ్ కి సలహా ఇస్తుంది రామలక్ష్మి. అదంతా రామలక్ష్మి గుర్తుచేసుకుంటుంది.
రామలక్ష్మి ఏం తెలియనట్లు బాబు ఎక్కడ అని వెతుకుతుంది. నోరు అదుపులో ఉంచుకోలేవా అంటూ రమ్యపై శ్రీలత కోప్పడుతుంది. ఈ మైథిలి ప్లాన్ అయి ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళు సీసీటీవీ చూస్తారు అందులో రామలక్ష్మి రామ్ తో మాట్లాడినాక రామ్ వెళ్ళిపోతాడు. మా రామ్ తో ఏం చెప్పావ్.. ఎందుకు వెళ్ళిపోయాడంటూ శ్రీలత వాళ్ళు రామలక్ష్మిని నీలదీస్తారు. ఆ తర్వాత అందరు కలిసి రామ్ కోసం వెతుకుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |